Movie News

నితిన్‌ ‘మాస్ట్రో’ మూవీ ఫస్ట్‌ గ్లింప్స్‌‌

నితిన్‌ హీరోగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ‘మాస్ట్రో’ పేరుతో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ సూపర్‌హిట్ మూవీ ‘అంధాధూన్’కిది రీమేక్. మార్చి 30న(మంగళవారం) నితిన్‌ పుట్టినరోజు కానుకగా ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌, ఫస్ట్‌ గ్లింప్స్‌ని చిత్రయూనిట్‌ విడుదల చేసింది. ఫస్ట్‌లుక్‌లో కళ్లకు నల్లటి గాగుల్స్‌ పెట్టుకొని, చేత్తో ఓ స్టిక్‌ పట్టుకొని నడుస్తూ అంధునిగా కనిపిస్తున్నాడు నితిన్‌. పోస్టర్‌లో పియానోపై రక్తపు మరకలు కథపై ఆసక్తిని ...

Read More »

‘త్వరలో వెంకీ పింకీ జంప్’కి క్లాప్ కొట్టిన మంత్రి హరీశ్‌రావు

‘ప్రేమ పిలుస్తోంది’ సినిమాతో ద‌ర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అజ‌య్ నాత‌రి, శ్రీ ల‌క్ష్మీ వెంక‌టేశ్వర ఫిలింస్ కాంబినేషన్లో శ్రీమ‌తి ల‌క్ష్మీరేసు స‌మ‌ర్పణ‌లో వెంక‌ట్ ఆర్ నిర్మిస్తోన్న చిత్రం ‘త్వర‌లో వెంకీ పింకీ జంప్‌’. విక్రమ్, దేవ‌కి ర‌మ్య, హ‌ర్సిత హీరో హీరోయిన్లుగా న‌టిస్తోన్న ఈ చిత్రం ప్రారంభోత్సవం ఇటీవ‌ల ఘనంగా జ‌రిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావు తొలి స‌న్నివేశానికి ...

Read More »

వి.వి.వినాయక్ చేతుల మీదుగా ‘నిన్ను చేరి’ వెబ్ సిరీస్ లోగో లాంచ్

తేజా హనుమాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజు ఆనేం, మాధురి హీరో హీరోయిన్లుగా గౌతమ్ రాజు, భద్రం, శాంతి స్వరూప్, కిషోరో దాసు నటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న వెబ్ సిరీస్ ‘నిన్ను చేరి’. సాయికృష్ణ తల్లాడ డైరెక్షన్ చేసిన ఈ వెబ్ సిరీస్ టైటిల్‌ లోగోను హోలీ పండుగ సందర్భంగా ఈ సిరీస్ టైటిల్ లుక్ ని ప్రముఖ డైరెక్టర్ వి.వి.వినాయక్ విడుదల చేశారు. ఈ సందర్భంగా వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. ...

Read More »

గుణ‌శేఖ‌ర్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘శాకుంత‌లం’ మొదలైంది

టాలీవుడ్‌లో పౌరాణిక, క‌మ‌ర్షియ‌ల్ సినిమాల‌తో త‌న‌కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైన‌మిక్ డైరెక్టర్ గుణ‌శేఖ‌ర్ ఆదిప‌ర్వంలోని ఆహ్లాద‌క‌ర‌మైన ప్రేమ‌క‌థ ఆధారంగా తెర‌కెక్కిస్తోన్న చిత్రం `శాకుంతలం`. ప్యాన్ ఇండియా మూవీగా రూపొందుతోన్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు స‌మ‌ర్పణ‌లో డీఆర్‌పీ-గుణా టీమ్ వర్క్స్‌ ప‌తాకంపై గుణ‌శేఖ‌ర్ కుమార్తె నీలిమ గుణ నిర్మిస్తున్నారు. స్టార్ హీరోయిన్ స‌మంత అక్కినేని శకుంతలగా టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో మలయాళ హీరో దేవ్ మోహన్ దుష్యంతుడిగా ...

Read More »

రామ్‌తో ‘జగడం’ రీమేక్ చేయాలనుంది: సుకుమార్

పదిహేడేళ్ల కుర్రాడు… కొత్తగా గ్యాంగ్‌లో జాయిన్ అయ్యాడు. కొట్లాటకు గ్యాంగ్ సభ్యులతో కలిసి వెళ్ళాడు. ఎదురుగా పెద్ద గ్యాంగ్ ఉంది. వాళ్ళను చూసి కుర్రాడి గ్యాంగ్ లీడర్ భయపడి వెనకడుగు వేశాడు. కానీ కుర్రాడు వేయలేదు. చురకత్తుల్లాంటి చూపులతో తనకంటే బలవంతుడిని ఢీ కొట్టి ధైర్యంగా నిలబడ్డాడు. ఆ సీన్‌కి రాజమౌళి కూడా ఫ్యాన్ అయిపోయాడు. గ్యాంగ్‌కి కుర్రాడు కొత్త. కాని సినిమా ఇండస్ట్రీకి, ప్రేక్షకులకు కాదు. అప్పటికే ‘దేవదాసు’తో ...

Read More »

దుమ్ము రేపుతున్న ‘సారంగ దరియా’ సాంగ్.. టాలీవుడ్ చరిత్రలోనే అరుదైన రికార్డు

దర్శకుడు శేఖర్ కమ్ముల రూపొందిస్తున్న ప్రేమ కావ్యం ‘లవ్ స్టోరీ’. నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా విడుదలకు ముందే ఎన్నో సంచలనాలు క్రియేట్ చేస్తోంది. ‘లవ్ స్టోరీ’ ఒక్కో పాట ఆణి ముత్యాల్లా తయారై శ్రోతలను ఆకట్టుకుంటున్నాయి. రెండు వారాల కిందట రిలీజ్ చేసిన ‘సారంగ దరియా’ పాట ఫాస్టెస్ట్ 50 మిలియన్ వ్యూస్ క్లబ్ లో చేరింది. ఫిబ్రవరి 28న సమంత చేతుల ...

Read More »

ఆ విషయంలో హద్దులేమీ పెట్టుకోలేదు: ‘శశి’ హీరోయిన్ సుర‌భి

ధనుష్ హీరోగా తెరకెక్కిన ‘రఘువరన్ బీటెక్’ సినిమాలో నటించి, ఆ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల నటి సురభి.. బీరువా, ఎక్స్‌ప్రెస్‌ రాజా, ఎటాక్, జెంటిల్‌మెన్‌, ఒక్కక్షణం, ఓటర్‌ సినిమాల‌తో మెప్పించింది. ఆది సాయికుమార్ హీరోగా, శ్రీనివాస్ నాయుడు నందికట్ల దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘శశి’లో హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీ హనుమాన్ మూవీ మేకర్స్ పతాకంపై ఆర్.పి. వర్మ, సి. రామాంజనేయులు, చింతలపూడి శ్రీనివాసరావు సంయుక్తంగా ఈ ...

Read More »

‘జాతిరత్నాలు’ మూవీ రివ్యూ

చిత్రం: జాతిర‌త్నాలు న‌టీన‌టులు: న‌వీన్ పొలిశెట్టి, ఫ‌రియా అబ్దుల్లా, ప్రియ‌ద‌ర్శి, రాహుల్ రామ‌కృష్ణ, ముర‌ళి శ‌ర్మ, త‌నికెళ్ల భ‌ర‌ణి, బ్రహ్మానందం, వెన్నెల కిషోర్‌, బ్రహ్మాజీ, న‌రేష్ త‌దిత‌రులు సంగీతం: ర‌ధ‌న్‌ కెమెరా: సిద్ధం మ‌నోహ‌ర్‌ ఆర్ట్స్: చ‌ంద్రిక – అలీ; నిర్మాత‌: నాగ్ అశ్విన్‌ ద‌ర్శక‌త్వం: కె.వి. అనుదీప్‌; నిర్మాణ సంస్థ: స్వప్న సినిమా విడుద‌ల తేదీ: 11-03-2021 ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’‌తో తెలుగు తెరకు పరిచయమైన నవీన్ పోలిశెట్టి… ...

Read More »

అలీ అబ్దుల్ కలాంగా హాలీవుడ్ ను భారత గడ్డపై దింపిన భగీరథుడు జగదీష్ -కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్

హాలీవుడ్ దిగ్గజాలను భారత గడ్డపై దింపి, తన కథలతో ఇండో- అమెరికన్ సినిమా ఒప్పందాలను కుదుర్చుకున్న భారతీయ హాలీవుడ్ యువ దర్శకుడు జగదీష్ దానేటిపై కేంద్ర ప్రసార, సమాచార శాఖా మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రశంసల వర్షం కురిపించారు. హాలీవుడ్ లో ప్రత్యక్షంగా కమర్షియల్ చిత్రాలకు దర్శకత్వం వహిస్తున్న తొలి భారతీయ దర్శకుడు జగదీష్ దానేటి అని ఆయన కొనియాడారు. లాస్ ఏంజిల్స్, అమెరికాకు చెందిన పింక్ జాగ్వర్స్ ఎంటర్ ...

Read More »