జులై 7న “సాక్ష్యం” ఆడియో విడుదల!

హీరో బెల్లంకొండ శ్రీనివాస్, పూజా హెగ్డే జంటగా నటించిన ‘సాక్ష్యం’ సినిమా ఆడియో వేడుక జూలై 7న జరగబోతోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. ప్రకృతే సాక్షంగా ఈ సినిమా రూపొందించబడుతోంది.

శ్రీవాసు దర్శకత్వం వహించిన ఈ సినిమా టీజర్ కు మంచి స్పందన లభించింది. ఆర్తు ఏ విల్సన్ అందించిన విజువల్ ఎఫెక్ట్స్ సాక్ష్యం సినిమాకు ప్రధానబలం కానున్నాయి. ‘బాహుబలి’ చిత్రానికి సిజి వర్క్ చేసిన టీం ఈ చిత్రానికి వర్క్ చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘సాక్షం’ చిత్రంలోని రెండు పాటలకు మంచి రెస్పాన్స్ అభించింది. ‘టైమ్స్ మ్యూజిక్ సౌత్’ సంస్థ సాక్షం చిత్ర ఆడియో హక్కులను సొంతం చేసుకుంది.
భారి తారాగణంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో జగపతిబాబు, శరత్ కుమార్, రావ్ రమేష్, పవిత్ర లోకేష్, వెన్నెల కిషోర్, మరియు నటి మీనా ఈ చిత్రంలో నటించారు.

నటీనటులు:
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, పూజా హెగ్డే, శరత్ కుమార్, మీనా, జగపతిబాబు, రవికిషన్, అశుతోష్ రానా, మధు గురు స్వామి, జయ ప్రకాష్, పవిత్ర లోకేష్, వెన్నెల కిషోర్.

సాంకేతిక నిపుణులు:
డైరెక్టర్: శ్రీవాసు
బ్యానర్: అభిషేక్ పిక్చర్స్
నిర్మాత: అబిషేక్ నమ
మ్యూజిక్ డైరెక్టర్ : హర్షవర్ధన్ రామేశ్వరన్
కెమెరామెన్: ఆర్థర్ ఏ విల్సన్
ఆర్ట్ : ఏఎస్. ప్రకాష్
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వర రావ్
డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా
యాక్షన్: పీటర్ హెయిన్
పి.ఆర్.ఓ: వంశీ – శేఖర్
లిరిక్స్: అనంత శ్రీరామ్
ఆడియో: జంగ్లీ మ్యూజిక్