నాగ్ లుక్ చూస్తే..షాక్ అవుతారు!

తెలుగు ఇండస్ట్రీలో అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నాగార్జున..ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించారు. మన్మధుడు, కింగ్ నాగార్జునగా పేరు తెచ్చుకున్నాడు. హీరోగానే కాకుండా నిర్మాతగా కొనసాగుతున్న నాగార్జున పలు యాడ్స్ లో కూడా తన సత్తా చాటుతున్నాడు. ప్రస్తుతం నాగార్జున, నాని మల్టీస్టారర్ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది.

నాగ్ లుక్ చూస్తే..షాక్ అవుతారు!

కాగా, ఈ చిత్రంలో నాగార్జున డాన్ గా నటిస్తున్నారు..అంటూ ప్రచారం జరుగుతుంది. మరో హీరోగా నాని ఓ డాక్టర్ గా కనిపించబోతున్నాడట. ఇదిలా తెల్లగడ్డం.. కాస్త నెరిసిన జుట్టు.. కళ్లజోడు.. మెడలో ఎర్ర తువ్వాలు… నాగార్జున వయసు పైబడిన వ్యక్తిగా కనిపిస్తున్న లుక్‌ ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొట్టింది. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో అశ్వనీదత్‌ నిర్మిస్తున్న ‘దేవదాసు’లో ఆయన లుక్‌ ఇదే అయ్యుంటుందని పలువురు భావించారు.

వాస్తవానికి ఆ లుక్‌ దేవదాసు చిత్రంలోనిది కాదట. . ఓ వాణిజ్య ప్రకటన కోసం నాగార్జున ఈ లుక్‌లో కనిపించనున్నారు. ఆయన పక్కనున్న చిన్నారి మీనాక్షి. మలయాళ చిత్రాల్లో నటిస్తుంటుంది. జూలై 4న తన ఫేస్‌బుక్‌ పేజీలో ఈ ఫొటోని పోస్ట్‌ చేసింది. ఇద్దరూ కలిసి ఓ వాణిజ్య ప్రకటనలో నటించిన సమయంలో ఈ ఫొటో దిగారని తెలుస్తోంది.