పోలీస్ స్టేషన్ సెట్ లో సమంత “యు టర్న్” చిత్ర షూటింగ్!


వరుసగా సక్సెస్ ఫుల్ చిత్రాల్లో నటిస్తున్న సమంత ప్రస్తుతం “యు టర్న్” సినిమాలో నటిస్తోంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. సమంత ఈ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో కనిపించనుంది. తాజాగా టైమ్స్ అఫ్ ఇండియా, హైదరాబాద్ లో ఒక షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఒక పోలీస్ స్టేషన్ సెట్ లో జాతుగుతోంది. ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాలో నటిస్తున్నారు. పవన్ కుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాకు నికేత్ సినిమాటోగ్రఫి అందుస్తున్నారు. సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. త్వరలో సమంత ఫస్ట్ లుక్ ను విడుదల చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

నటీనటులు:
సమంత, ఆది పినిశెట్టి, రాహుల్ రవీంద్రన్, భూమిక చావ్ల, అడుకలం నరేన్, రవి ప్రకాష్, బిర్లా బోస్, ఛత్రపతి శేఖర్.

సాంకేతిక నిపుణులు:
డైరెక్టర్: పవన్ కుమార్
నిర్మాత: శ్రీనివాస్ చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
సినిమాటోగ్రఫి: నికేత్