ఎన్టీఆర్ క‌థానాయ‌కుడు రివ్యూ

Telugu Box Office

ntr-kathanayakudu-telugu-movie-review

కథ :

తారకరామారావు గారు మెదట రిజిస్టార్ ఆఫీస్ ఉద్యోగం చేసేవారు. కానీ 1947 వ సంవత్సరం లో ఆ ఉద్యోగానికి రాజీనామా చేస్తారు.
ఆ తరువాత సినిమా లపై ఉన్న మక్కువ తో చెన్నెకి వెళ్తాడు. సినిరంగం లో అందరిలాగనే అనేక ఇబ్బందులు ఎదుర్కోంటాడు. ఎల్వీ ప్రసాద్ గారి సహాయం తో సినిమా అవకాశాలు వస్తాయి. కానీ మయాబజార్ సినిమా లో కృష్ణడిగా వచ్చి అందరిని ఆకట్టుకుంటాడు. ఇక అప్పటినుంచి ఆయనోక గోప్ప స్టార్ గా ఎదుగుతాడు. ఈ కధ బసవతారకమ్మ గారి పాత్ర ని కూడా విశేషంగా చూపించారు. సినిమా లో అందరు లీనమై అయిపోయేలా సినిమాకధని తీర్చిదిద్దారు.

నటీనటుల ప్రతిభ :

బాలయ్య బాబు గారి గురించి చెప్పడానికి మాటలు సరిపోవు. స్వర్గీయ నందమూరి తారకరామరావు గారిని అచ్చుగద్దినట్లు దింపేశాడు.
దాంతో పాటు ఆయన పై బాలయ్య బాబుకి ఉన్న గౌరవాన్ని కళ్ళకు కట్టీనట్లు చూపించారు. ఎన్టీఆర్ ని గుర్తుచేయడం లో ఫుల్ సక్సెస్ అయ్యడు అనే చెప్పాలి. ఆ తరువాత బసవతారకమ్మ గారి పాత్రని విద్యాబాలన్ ప్రాణం పోసింది అనే చెప్పాలి. ఇక సుమంత్ అక్కినేని నాగేశ్వర రావు గారి గెటప్ లో అదరగోట్టాడు. కళ్యాణ్ రామ్ కూడా హరికృష్ణ గారి పాత్రని చించేశాడు. చంద్రబాబు ను పాత్ర లో రానా ఇమిడిపోయాడు. సేమ్ టూ సేమ్ బాబు లాగే కనిపిస్తాడు. ఇక రకుల్,హాన్సిక, పాయల్,జయసుధ,జయ ప్రద లు అలా కనిపించి విందు చేస్తారు. నిత్యామీనన్ సావిత్రి పాత్ర లో నటించి అందరికి షాక్ ఇచ్చింది.

నటీనటులు అందరూ తమ పాత్రల్లో ఒదిగిపోయారు.

నటనా అనుభవం లేని క్రిష్‌, సాయి మాధవ్‌ కూడా అనుభవజ్ఞులైన ప్రకాష్‌రాజ్‌, మురళిశర్మలతో పోటీపడ్డారు. తెరవెనుక ప్రతి ఒక్కరూ చక్కని ప్రతిభ చూపించారు.

సంభాషణలు, సినిమాటోగ్రఫీ, సంగీతం, ప్రొడక్షన్‌ డిజైన్‌ అన్నీ చాలా చక్కగా కుదిరాయి. ఆ కాలం వాతావరణాన్ని ప్రతిబింబించే ఆర్ట్‌కి తోడు, డ్రామాని ఎలివేట్‌ చేసిన కెమెరా, మ్యూజిక్‌ ఈ చిత్రానికి ప్లస్‌ అయ్యాయి. ‘మహానటి’ మాదిరిగా ఎమోషనల్‌గా కనక్ట్‌ చేసేంత డ్రామాకి తావు లేకపోయినా, తొలి సూపర్‌స్టార్‌ ఎదుగుదలని, ఆయన ఆలోచనలు, అంతరంగాన్ని ఆవిష్కరించి, ఆసక్తికరంగా చెప్పడంలో ‘ఎన్టీఆర్‌’ టీమ్‌ సక్సెస్‌ అయింది.

సాంకేతికవర్గం పనితీరు :

ఈ సినిమా కిగాను సినిమా ఆటో గ్రాపీ గా జ్ఞానశేఖర్ కి వందకి వంద మార్కులు వేయెచ్చు. బాలయ్య బాబు ని ప్రతి గెటప్ లో అదరగోట్టాడు. జ్ఞాన శేఖర్ ఈ సినిమా పై పెట్టిన శ్రద్ద స్రీన్ పై కనిపిస్తుంది. కీరవాణి మరోక సారి తన మార్క్ సంగీతం తో అందరిని కట్టి పడేశాడు.

పాటలకి, సన్నివేషాలకి తగ్గట్లుగా సంగీతాన్ని అందించాడు. క్రిష్ తనదైన కధనం తో మరోకసారి తన టాలెంట్ ను బయటపెట్టాడు.తెలుగువాడు గర్వేపడేలా క్రిష్ ఎన్టీఆర్ బయోపిక్ తీశాడు. ఇక బాలయ్య బాబు నిర్మాతగా ఎక్కడ డబ్బు పెట్టడానికి వెనుకాడలేదు. ప్రోడక్షన్ వ్యాల్స్ సూపర్ గా ఉన్నాయి.

విశ్లేషణ :

ఎన్.టి.ఆర్ బయోపిక్ లో మొదటి పార్ట్ గా వచ్చిన కథానాయకుడు ఎన్.టి.ఆర్ యవ్వనం, సినిమాల్లోకి ప్రవేశం వంటి అంశాలతో తెరకెక్కించారు. సినిమా పరిశ్రమలో ఆయన చేసిన పాత్రలు.. తెలుగు పరిశ్రమకు ఆయన చేసిన సేవలను ఈ కథానాయకుడు సినిమాలో ప్రస్థావించారు. అయితే సినిమాలో బాలకృష్ణ అచ్చం ఎన్.టి.ఆర్ లా అభినయం అదరగొట్టాడు.

మనం నిజంగా చూసేదీ ఎన్టీఆరే కదా అన్నట్లు చూపించాడు క్రిష్. బాలయ్య బాబు తన తండ్రిపై ఉన్న గౌరవం తో ఈ సినిమా చాలా శ్రద్ద కనబరిచారు. అది స్రీన్ పై కనిపించింది. ఈ సినిమా లో దాదాపు 60 గెటప్స్ వేశారు. ప్రతీ గెటప్ లో బాలయ్య బాబు గారి ఆహార్యం కానీ డెలాగ్ డెలీవరీ కానీ నా భూతో నా భవిష్యత్తు అన్నట్లుంది.

ప్లస్ పాయింట్స్ :

బాలయ్య బాబు,బాలయ్య బాబు

సంగీతం

సినిమాటో గ్రఫీ

మాయబజార్ సీన్స్

అలనాటి ట్రెండింగ్ పాటలు,ఫరెఫక్ట్ టైమింగ్

బాటం లైన్ :

ఒక్క మాటలో చెప్పాలంటే మనం బాలయ్య బాబు ఈ రేంజ్ లో సినిమా తీస్తాడు అస్సలు ఉహించి ఉండం. మనం ఉహించిన దాని కన్నా కూడా సినిమా డబుల్ రేంజ్ లో ఉంది. ఎన్టీఆర్ కథానాయకుడు సినిమా ఎన్టీఆర్ ఫాన్స్ కి కనులపండగ ఉంటుంది. తప్పనిసరిగా చుడండి

Share This Article