Tag Archives: ఆంజనేయస్వామి

కార్యసిద్దిని చేకూర్చే శక్తివంతమైన ఆంజనేయ స్వామి శ్లోకాలు

హనుమంతుడు కార్యసాధకుడు. భక్తితో హనుమంతుడిని కొలిచిన వారికి వారి కోరికలు తప్పక నెరవేరతాయి. భక్తులు వారి వారి కోరికను అనుసరించి ఆంజనేయ శ్లోకాలను భక్తితో స్మరిస్తే కార్యసిద్ధి సాధించగలుగుతారు. విద్యా ప్రాప్తికి పూజ్యాయ, వాయుపుత్రాయ వాగ్ధోష వినాశన!సకల విద్యాంకురమే దేవ రామదూత నమోస్తుతే!! ఉద్యోగ ప్రాప్తికి హనుమాన్ సర్వధర్మజ్ఞ సర్వా పీడా వినాశినే!ఉద్యోగ ప్రాప్త సిద్ధ్యర్థం శివరూపా నమోస్తుతే!! కార్య సాధనకు అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకిమ్ వద!రామదూత ...

Read More »

హనుమంతుడికి తమలపాకులతో పూజ ఎందుకు చేస్తారు.. ఫలితం ఏంటి?

ఒకసారి సీతాదేవి అందించే తమలపాకుల చిలుకల్ని సేవిస్తున్న శ్రీరాముని వద్దకు వచ్చిన హనుమంతుడు శ్రీరాముడిని ”స్వామీ ఏమిటది ? మీ నోరు అంత ఎర్రగా ఎందుకయ్యింది? అని అడిగాడు. అప్పుడు రాముడు ‘తమలపాకులు తింటే నోరు ఎర్రగా అవుతుంది. అంతేకాదు ఆరోగ్యానికి చాలా మంచిది అని చెప్పగానే వెంటనే హనుమంతుడు అక్కడి నుండి వెళ్లిపోయి కొంత సేపటికి ఒళ్లంతా తమల పాకులను కట్టుకొని గంతులు వేస్తూ ఆనందంగా వచ్చాడట. హనుమంతుడు ...

Read More »

హనుమంతుడికి సింధూరం ఎందుకంత ఇష్టమో తెలుసా

ఆంజనేయునికి సింధూరం అంటే చాలా ఇష్టం. ఎందుకంటే.. సీతమ్మ పాపిట బొట్టు పెట్టుకోవడం చూసిన ఆంజనేయుడు ఓసారి ఎందుకలా పెట్టుకుంటున్నావని సీతాదేవిని అడుగుతాడు. అందుకు సీతమ్మ నవ్వుతూ ఈ పాపిట బొట్టువలన నేను రామప్రేమను పొందానని చెప్పింది. ఈ బొట్టు రాముల వారికి చాలా ఇష్టమని చెప్పారు. దాంతో వెంటనే హనుమంతుడు సిందూరాన్ని తన శరీరమంతా పూసుకున్నాడు. ఆయనకు ఆపాదమస్తకం రోమాలు ఉండడం చేత ఆ సిందూరం వెంటనే రాలిపోయేది. ...

Read More »

హనుమంతునికి వడ మాల ఎందుకు వేస్తారు.. ప్రయోజనం ఏంటి?

అంజనాదేవికి, వాయు భగవానునికి జన్మించిన ఆంజనేయుడు బాల్యంలో అకాశంలో ఉన్న సూర్యుడిని పండుగా భావించి ఎగిరి పట్టుకోవాలనుకున్నాడు. వాయుపుత్రుడు కావడంతో అకాశానికి ఎగిరాడు. సూర్యుడిని పట్టుకునేందుకు వాయుపుత్రుడు ఇలా ఆకాశానికి ఎగిరెళ్ళడం చూసిన దేవతలంతా విస్తుపోయారు. అప్పుడు ఇంద్రుడు తన వజ్రాయుధాన్ని విసిరి ఆంజనేయుడిని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. అపుడు వజ్రాయుధం హనుమంతుడి దవడ తాకింది. హనుమంతుని దవడ కి గాయమేర్పడింది. అందుచేత సుందరుడు అనే పేరుగల ఆంజనేయుడు హనుమంతునిగా పిలుస్తారు. ...

Read More »