అడివి శేష్ ‘మేజర్’ టీజర్

2008 నవంబర్‌లో ముంబయి నగరంలో జరిగిన భయానక ఉగ్రవాద దాడిలో వీరోచితంగా పోరాడి ఎంతో మంది ప్రాణాలు కాపాడి వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితగాధ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. అడివి శేష్ టైటిల్ రోల్ పోషిస్తుండగా సైయీ మంజ్రేకర్, శోభితా ధూళిపాళ్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఉగాది కానుకగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. తెలుగులో ఈ టీజర్‌ని సూపర్‌స్టార్ మహేశ్ బాబు విడుదల చేయగా.. హిందీలో సల్మాన్ ఖాన్, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్ విడుదల చేశారు. అద్భుతమైన విజువల్స్, మంచి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ఈ టీజర్ వీక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. చివరిగా ‘మీరు పైకి రాకండి.. వాళ్లని నేను హ్యాండిల్ చేస్తాను’ అంటూ అడివి శేష్ చెప్పిన డైలాగ్ కొసమెరుపు.