Latest Trends

60 వసంతాల ‘గుండమ్మ కథ’.. తెరవెనుక ఎన్నో ఆసక్తికర విశేషాలు

విజయా సంస్థ నిర్మించిన చిత్రాల్లో ఆఖరి విజయవంతమైన చిత్రం ‘గుండమ్మ కథ’. అప్పటిలో ఇది అగ్రశ్రేణి నటులతో నిర్మించిన మల్టీ స్టారర్. కాని “గుండమ్మ కథ” అని సూర్యకాంతం పాత్ర పేరుమీద సినిమా పేరు పెట్టడమే గొప్ప వైవిధ్యం. హాస్యం, సంగీతం ఈ చిత్రానికి అద్భుత విజయాన్ని సమకూర్చాయి. జానపద బ్రహ్మగా పేరొందిన విఠలాచార్య కన్నడంలో మనె తుంబిద హెణ్ణు పేరిట కుటుంబ కథాచిత్రాన్ని తెరకెక్కించారు. చిత్ర నిర్మాణానికి విఠలాచార్య ...

Read More »

సుక్కూ-బన్నీ హ్యాట్రిక్ కాంబో: ‘పుష్ప’ గురించి ఆసక్తికర విశేషాలు మీకోసం..

ఆర్య, ఆర్య-2 చిత్రాలతో టాలీవుడ్‌లో హిట్‌ కాంబినేషన్‌గా ముద్రపడ్డారు జీనియస్ డైరెక్టర్ సుకుమార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. వారిద్దరి కలయికలో హ్యాట్రిక్ మూవీగా తెరకెక్కింది ‘పుష్ప’. 12 ఏళ్ల తర్వాత బన్నీ, సుకుమార్ కలిసి చేస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. రెండు భాగాలుగా తెరకెక్కిన ఈ సినిమాలోని మొదటి పార్ట్‌ ‘పుష్ప – ది రైజ్‌’ డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ...

Read More »

అడివి శేష్ ‘మేజర్’ టీజర్

2008 నవంబర్‌లో ముంబయి నగరంలో జరిగిన భయానక ఉగ్రవాద దాడిలో వీరోచితంగా పోరాడి ఎంతో మంది ప్రాణాలు కాపాడి వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితగాధ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘మేజర్’. అడివి శేష్ టైటిల్ రోల్ పోషిస్తుండగా సైయీ మంజ్రేకర్, శోభితా ధూళిపాళ్ల కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఉగాది కానుకగా ఈ సినిమా టీజర్‌ని విడుదల చేశారు. తెలుగులో ఈ టీజర్‌ని సూపర్‌స్టార్ మహేశ్ బాబు విడుదల ...

Read More »

రవితేజ ‘ఖిలాడి’ టీజర్.. డిఫరెంట్ షేడ్స్‌లో మాస్ మహరాజ్

‘క్రాక్’ సినిమాతో మళ్లీ సక్సెస్ ట్రాక్ ఎక్కిన మాస్ మహరాజ్ రవితేజ ఈసారి ‘ఖిలాడి’గా రాబోతున్నాడు. రమేష్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను డా.జయంతిలాల్‌ గడ సమర్పణలో ఏ స్టూడియోస్‌, పెన్‌ స్టూడియోస్‌ పతాకాలపై సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి, డింపుల్‌ హయతి హీరోయిన్లు. గత కొన్ని రోజులుగా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి సోమవారం టీజర్ విడుదల చేసింది యూనిట్. ప్రేక్షకులకు ఉగాది ...

Read More »

మెగాస్టార్ ‘ఆచార్య’ ఫస్ట్ సాంగ్ అదుర్స్‌

మెగా అభిమానులకు అదిరిపోయే సర్‌ప్రైజ్‌ ఇచ్చిందిన ‘ఆచార్య’ టీమ్. కొరటాల శివ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆచార్య’. కాజల్‌ అగర్వాల్‌ కథానాయిక. నిరంజన్‌ రెడ్డి, రామ్‌చరణ్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. చరణ్ ఈ సినిమాను సిద్ధ అనే కీలక పాత్రలో కనిపించనున్నాడు. చిరంజీవి 152వ చిత్రంగా ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ‘ఆచార్య’లోని మొదటి లిరికల్‌ సాంగ్‌ను బుధవారం విడుదల చేసింది చిత్ర బృందం. ‘లాహే లాహే’ అంటూ సాగే ...

Read More »

‘వకీల్ సాబ్’ ట్రైలర్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన ‘వకీల్ సాబ్’ ట్రైలర్ వచ్చేసింది. ‘కోర్టులో వాదించడం తెలుసు.. కోటు తీసి కొట్టడమూ తెలుసు’ అంటూ టీజర్‌తో తన పాత్ర ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ ట్రైలర్‌లో తన విశ్వరూపం చూపించారు. బాలీవుడ్‌లో విజయవంతమైన ‘పింక్‌’కి రీమేక్‌గా రూపొందుతున్న చిత్రమిది. శ్రీరామ్‌ వేణు దర్శకుడు. దిల్‌రాజు, శిరీష్‌ సంయుక్తంగా నిర్మించారు. శ్రుతిహాసన్‌, నివేదా థామస్‌, అంజలి, అనన్య ...

Read More »