News

విలీనం తర్వాత నిజాం ఏమయ్యారు? ఎలా చనిపోయారు?

భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ పోలో’ విజయవంతం కావడంతో హైదరాబాద్ సంస్థానంపై ఏడో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పట్టు చేజారిపోయింది. 1948, సెప్టెంబర్ 17న తన సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో భారత ప్రభుత్వం ఆయన్ని రాజ్‌ప్రముఖ్‌గా గుర్తించింది. ఇక్కడివరకు అందరికీ తెలిసిన విషయమే. అయితే ఆ తర్వాత ఏడో నిజాం ఏం చేశారు?.. ఎక్కడున్నారు?.. ఎలా చనిపోయారు?.. చివరి రోజుల ఎలా గడిపారు?.. ...

Read More »

గాల్లో విమానం.. ప్రయాణికుడికి అస్వస్థత, డాక్టర్‌గా మారిన గవర్నర్ తమిళిసై

వారణాసి నుండి తిరుగు ప్రయాణంలో ఢిల్లీ- హైదరాబాద్ అర్ధరాత్రి విమానంలో ప్రయాణిస్తున్న ఒక ప్రయాణికుడు అస్వస్థతకు గురికావడంతో ఆ విమానంలోనే ప్రయాణిస్తున్న గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ ఆ ప్రయాణికుడికి ప్రాథమిక చికిత్స చేశారు. ప్రయాణికుడు చెస్ట్ పెయిన్, ఇతర సమస్యలతో విమానం గాల్లో ఉన్నప్పుడు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో విమాన సిబ్బంది ఆ విమానంలో ఎవరైనా డాక్టర్స్ ఉన్నారా? అని అనౌన్స్ చేయడంతో విషయం తెలిసిన డాక్టర్ శ్రీమతి ...

Read More »

శ్రీవారి హుండీ గలగల.. టీటీడీ చరిత్రలోనే రికార్డుస్థాయి ఆదాయం

తిరుమల వేంకటేశ్వర స్వామి హుండీ కానుకలతో కళకళలాడుతోంది. టీటీడీ (TTD) చరిత్రలో శ్రీవారి హుండీకి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. భక్తులు స్వామివారికి కాసుల వర్షం కురిపించారు. ఈనెల రూ. 100 కోట్ల ఆదాయం దాటింది. కొన్ని నెలలుగా పెద్ద ఎత్తున తిరుమలకు భక్తులు వస్తున్నారు. శ్రీవారిని దర్శించుకుని విరివిగా కానుకలు సమర్పించుకుంటున్నారు. కరోనా ప్రభావం తగ్గడంతో తిరుమల కొండ నిత్యం రద్దీతో కళకళలాడుతోంది. మొక్కులున్న భక్తులతో పాటు, ముడుపులనూ ...

Read More »

మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య కన్నుమూత

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య కన్నుమూశారు. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ కు సీఎంగా పనిచేసిన రోశయ్య.. ఆర్థిక మంత్రిగా కూడా సేవలు అందించారు. అంతేకాకుండా తమిళనాడుకి గవర్నర్ గా పనిచేసిన ఆయన.. గతకొంతకాలంగా రాజకీయాలకి దూరంగా ఉంటున్నారు. కాగా రోశయ్య మృతిపట్ల రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. కొణిజేటి రోశయ్య 1933, జూలై 4న గుంటూరు జిల్లా వేమూరు ...

Read More »

మైమరపించే మారేడుమిల్లి… ప్రకృతి అందాలకు ఫిదా కావాల్సిందే

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రికి 87 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం మారేడుమిల్లి. విలక్షణమైన గిరిజన జీవనశైలి, విభిన్నమైన ప్రకృతి అందాలు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటాయి. నదులు, జలపాతాలతో పాటు సుందరమైన క్యాంపింగ్ ప్రాంతాలు కూడా ఇక్కడ ఉన్నాయి. వారాంతాల్లో సరదాగా పిక్నిక్‌లకు వెళ్లేందుకు ఇది సరైన ప్రాంతం. ముఖ్యంగా వర్షాకాలం, శీతాకాలాల్లో ఈ ప్రాంతం పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది. ఆకుపచ్చ లోయలు, వృక్షజాలం పరవశింపజేస్తాయి. హైదరాబాద్, ...

Read More »

116 అడుగుల సాయినాథుడు.. ప్రపంచంలోనే అతిపెద్ద బాబా విగ్రహం

సబ్‌కా మాలిక్‌ ఏక్‌ అన్న సందేశంతో యావత్‌ మానవాళికి శాంతి సందేశాన్నిచ్చిన సాయి భగవాన్‌ ప్రసిద్ధ మందిరం మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ జిల్లా షిర్డిలో ఉన్న సంగతి తెలిసిందే. మరి ప్రపంచంలోనే అతిపెద్ద సాయినాథుడి విగ్రహం ఎక్కడుందో తెలుసా.. ఇంకెక్కడో కాదు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు సమీపంలో. కాకినాడ రూరల్ మండలం కొవ్వాడ సమీపంలోని రేపూరు గ్రామంలో నెలకొల్పిన 116 అడుగుల భారీ సాయిబాబా విగ్రహం అందరినీ ఆకట్టుకుంటోంది. కాకినాడ ...

Read More »

ప్రకృతి అందాల స్వర్గధామం.. కోనసీమ చూసి తీరాల్సిందే!

‘కోనసీమ’.. కేరళను తలదన్నే పచ్చటి అందాలతో ఆంధ్రా పాలిట భూతలస్వర్గంగా ప్రసిద్ధి చెందింది. ప్రకృతి రమణీయకతకు నిలువుటద్దంగా నిలిచే ప్రాంతం ప్రకృతి అందాలతో ఎప్పుడూ కళకళల్లాడుతూ ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లాలో గోదావరి పరీవాహక ప్రాంతంలోని త్రిభుజాకార ప్రదేశాన్ని కోనసీమగా పిలుస్తారు. దీని ప్రధాన కేంద్రం అమలాపురం. పచ్చని తివాచీ పరిచినట్లుండే కోనసీమలో నదీ సంగమ ప్రదేశాలు, ఓడరేవులు, ఆహారాలు విశేషంగా ఆకర్షిస్తాయి. కోనసీమ నాలుగు వైపులా గోదావరి, బంగాళాఖాతాలు చుట్టుముట్టి ...

Read More »

ఖమ్మం: మహిళా కానిస్టేబుళ్లు ట్రిపుల్ రైడింగ్… కమిషనర్ సీరియస్, భారీగా ఫైన్

తెలంగాణాలోని ఖమ్మం జిల్లాలో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు ఒకే స్కూటీ ఎక్కారు. పైగా హెల్మెట్ ధరించలేదు. రోడ్డు మీద వాహనం దూసుకెళుతుండగా వారిలో ఇద్దరు సెల్‌ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు ఉల్లంఘనలకు పాల్పడ్డారు. ఖమ్మం రైల్వేస్టేషన్‌ సమీపంలో ముగ్గురు మహిళా కానిస్టేబుళ్లు స్కూటీపై ఈ విధంగా వెళ్తుండగా కొందరు ఫోటోలు తీసి సోషల్‌మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటో వైరల్‌ కావడంతో నెటిజన్లు ...

Read More »

మాదాపూర్ లో గర్ల్ ఫ్రెండ్ అరేబియన్ మండి రెస్టారెంట్‌ ని సినీనటి పాయల్ రాజపుట్, అచ్చం పేట MLA బాలరాజు మరియు బిగ్ బాస్ ఫేమ్ భాను శ్రీ కలసి ప్రారంభించారు.

అద్భుతమైన థీమ్‌ తో గర్ల్ ఫ్రెండ్ రెస్టారెంట్‌ మాదాపూర్ లో కొలువుదీరింది. ఈ రెస్టారెంట్‌కి ఎన్నో వినూత్న, విశేషాలు ఉన్నాయి. యువతను ఆకట్టుకునే విభిన్న రకాల అంశాలు, పరిసరాలు దీనికి కొత్త శోభను ఇస్తున్నాయి. రెస్టారెంట్‌ ప్రాంగణంలో పరచుకున్న పచ్చదనం ఆహ్లాదకరమైన అనుభూతిని అతిధులకు అందిస్తుంది. అత్యంత ఆనందదాయకమైన, హృదయాన్ని స్పర్శించే రుచుల ఆస్వాదనను అందిస్తామని నిర్వాహకులు తమ అతిధులకు హామీ ఇస్తున్నారు. రుచులెన్నో… థీమ్, యాంబియన్స్‌లో మాత్రమే కాకుండా ...

Read More »

పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గారి ఫై సాంగ్

పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి గారి ఫై సాంగ్ గానం:సంతోష్ గడ్డం,లిరిక్స్:హనుమయ్య బండారు,సంగీతం:ఏ.ఆర్.సన్నీ,ఎడిటింగ్:వీరు,నిర్మాత,దర్శకుడు:సాగర్ చీకటిపల్లి https://doc-0g-8s-docs.googleusercontent.com/docs/securesc/sola8t30ebnhr187gqb3hord9v4bgnma/btph3m4g2s222k24h2rcahc46hnql4a3/1579773600000/02150647854373464993/12553661493270918215/1jwRtV2zPxJwmLvrMnANOrOcczQYWQYSD?e=download&authuser=0

Read More »